పోలీస్ స్టేషన్ ఎదుట అనిల్ రెడ్డి భార్య ధర్నా

TPT: తిరుపతిలో దళితుడు పవన్‌పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన అనిల్ కుమార్ రెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన భార్య శుక్రవారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా తన భర్తను పోలీసులు విచారణ చేయకుండానే అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఈ కేసులో బాధితుడే ఇందులో అనిల్‌కు సంబంధం లేదని చెబుతున్నాడని, అలాంటప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు.