భద్రేశ్వర స్వామి దుకాణ సముదాయం పై కోర్టు స్టే
VKB: నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవస్థాన దుకాణాల సముదాయం నిర్మాణాలపై కోర్టు స్టే విధించినట్లు వీరసేవ యువదళ్ మాజీ నాయకులు పటేల్ ప్రవీణ్ పేర్కొన్నారు. దీంతో దేవస్థాన ఈవో కోర్టు ఆదేశాల మేరకు దుకాణాలన్నింటినీ సీజ్ చేశారు. అభివృద్ధి పేరుతో పటేల్ కిరణ్ కోట్లాదిరూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని పటేల్ ప్రవీణ్ ఆరోపించారు.