ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JGL: భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవం 45వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఆదివారం రోజున కథలాపూర్ భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో మండలాధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, ఆనంద రెడ్డి, బాపు రెడ్డి పాల్గొన్నారు.