పాఠశాలను తనిఖీ చేసిన MEO

పాఠశాలను తనిఖీ చేసిన MEO

SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఉపేందర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్ గోపయ్య, తదితరులు పాల్గొన్నారు.