కేజీబీవీలో పోషణ మాసంపై అవగాహన

కేజీబీవీలో పోషణ మాసంపై అవగాహన

NLG: మర్రిగూడలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ICDS ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ మాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు పోషకాహారం, రక్తహీనత నివారణ, చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే, పోషక విలువలు గల ఆహారం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, ICDS సూపర్‌వైజర్ యశోద తదితరులు పాల్గొన్నారు.