వైభవంగా గంగమ్మ తల్లి జాతర ప్రారంభం

వైభవంగా గంగమ్మ తల్లి జాతర ప్రారంభం

SRPT: మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో భాగంగా ఆదివారం మహిళలు గంపలెత్తుకొని ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు