బాలిక హత్యకేసు.. పోలీసుల అదుపులో అనుమానితుడు

బాలిక హత్యకేసు.. పోలీసుల అదుపులో అనుమానితుడు

మేడ్చల్: కూకట్ పల్లిలో పదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఒక అనుమానితుడైన సంజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి, కత్తితో పొడిచి చంపారు. ఇది తెలిసిన వ్యక్తుల పనేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.