ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: హరీశ్‌రావు

ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: హరీశ్‌రావు

TG: సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో మాజీమంత్రి హరీశ్ రావు పర్యటించారు. వైరల్ జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. 'రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించింది. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. తిమ్మాపూర్‌లో డెంగీ జ్వరాలతో ఇద్దరు చనిపోగా.. 40-50 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాలకు నిధులు లేక పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీసు ఇచ్చారు' అని అన్నారు.