ఎన్నికల కోడ్ .. ఫ్లెక్సీల తొలగింపు: కమిషనర్

ఎన్నికల కోడ్ .. ఫ్లెక్సీల తొలగింపు: కమిషనర్

SRPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సూర్యాపేట పట్టణంలో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో ఉన్న రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. విద్యుత్ స్తంభాలపై ఉన్న ప్రచార సామగ్రిని తొలగిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హనుమంత రెడ్డి హెచ్చరించారు.