భారతీయ సినిమా చరిత్రలో మైలురాయి ఇదే

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయి ఇదే

1913లో ఈరోజునే తొలిసారిగా విడుదలైన 'రాజా హరిశ్చంద్ర' మూవీని భారతీయ సినిమా చరిత్రలో ఓ గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే చాలా పరిమితమైన బడ్జెట్‌లో, కేవలం రూ.15,000 ఖర్చుతో నిర్మించారు. మొట్టమొదటి పూర్తిస్థాయి సినిమాగా వచ్చిన ఈ మూవీలో స్త్రీ పాత్రలు కూడా పురుషులే పోషించడం విశేషం. దీన్ని మొదట ముంబై కొరోనేషన్ సినిమా హాల్‌లో ప్రదర్శించారు.