VIDEO: కొల్లిపరలో మెగా వైద్య శిబిరం నిర్వహణ
GNTR: కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పొగాకు, మాదకద్రవ్యాల వాడకం వల్ల వచ్చే క్యాన్సర్ల గురించి ప్రముఖ వైద్యులు వివరించారు. ఈ శిబిరంలో స్థానికులకు అన్ని రకాల పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లతో పాటు ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఎంపీపీ బి. పద్మావతి పాల్గొన్నారు.