మండలంలో పర్యటించిన కలెక్టర్
NLR: జలదంకి మండలంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కావలి ఆర్డీవోతో కలిసి ఆదివార పర్యటించారు. ఈ సందర్భంగా కమ్మవారిపాలెం గ్రామం, చామదల గ్రామంలోని ఉబ్బలవాగు, కృష్ణాపాడు గ్రామంలోని నెరెళ్ల వాగు, గోపన్నపాలెం గ్రామంలోని ఊళ్ళ వాగు ప్రవాహ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గత వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులు రాకుండా అధికారులకు తగు సూచనలు చేశారు.