అమరావతి చట్టబద్దతపై దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే
కృష్ణా: బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేట గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహం నందు, పార్లమెంటులో అమరావతికి దక్కిన చట్టబద్ధమైన చారిత్రాత్మక విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రాత్రి పెడన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ దీపహారతులు వెలిగించారు. పార్లమెంట్ నిర్ణయంతో అమరావతికి దక్కిన చట్టబద్ధత ఆంధ్రుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.