మూసీ ప్రాజెక్టుకు వరద రాక

SRPT: వికారాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టుకు వరద పెరిగింది. ప్రస్తుతం 1225.01 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 637.05 అడుగులుగా ఉంది. మూసీ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.58 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.