మణిదీప్ మృతిపై కేసు నమోదు

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మండల కేంద్రానికి చెందిన మణిదీప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కుమారుడి మరణంపై ఎవరిపైన అనుమానం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.