ప్రధాన తూముల మరమ్మతు పనులు ప్రారంభం

ప్రధాన తూముల మరమ్మతు పనులు ప్రారంభం

WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లో ఊర చెరువు ప్రధాన తూముల మరమ్మతు పనులు ఇవాళ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ ప్రారంభించారు. తూముల్లో పూడిక పేరుకుపోవడంతో సాగునీటి సమస్యలు తలెత్తడంతో, రైతుల కోరిక మేరకు ఈ పనులు చేపట్టారు. ఈ పనులకు ఎమ్మెల్యే నాగరాజు సొంత నిధులు అందించారు. మరమ్మతు పనులు ప్రారంభమవడం పట్ల గ్రామ రైతులు సంతోషం వ్యక్తం చేశారు.