సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
BPT: కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీలో నివసించే ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.