చౌటుప్పల్‌లో ఉచిత కంటి వైద్య పరీక్షలు

చౌటుప్పల్‌లో ఉచిత కంటి వైద్య పరీక్షలు

BHNG: చౌటుప్పల్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఇవాళ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన 47 మందికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం 19 మందిని ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది.