ఒకేషనల్ కోర్సులతో ఉపాధి అవకాశాలు
AKP: ఒకేషనల్ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కశింకోట జెడ్పీ బాలికల హైస్కూల్ హెచ్ఎం స్వర్ణకుమారి అన్నారు. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు టూల్ కిట్స్ మంగళవారం అందజేశారు. తమ హైస్కూల్లో ఎలక్ట్రానిక్స్, బ్యూటిషీయన్‌కు సంబంధించిన ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.