VIDEO: రైతులకు రూ.17.36 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: రైతులకు రూ.17.36 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలోని బాబు జగజీవన్ హాల్‌లో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సౌమ్య పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలోని సుమారు 30 వేల మంది రైతులకు రూ.17.36 కోట్ల చెక్కును అందజేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు.