రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

MBNR: జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియరాలేదు. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.