మద్యం మత్తులో 100కు డయల్.. అరెస్ట్

మద్యం మత్తులో 100కు డయల్.. అరెస్ట్

సంగారెడ్డి: తాగిన మత్తులో ఆరు నెలల్లో 77 సార్లు డయల్ 100కి కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మండలంలోని పెద్ద ముబారక్‌పూర్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి రోజుకో ఊరు రోజుకో పేరు చెప్పుకుంటూ చనిపోతున్నానని, పెట్రోల్ పోసుకున్నానని, ఇలా 100 కాల్ చేసి విధులకు ఆటంకం కలిగించడంతో అరెస్ట్ చేశామన్నారు.