ఈ నెల 14న నేవీ మారథాన్
VSP: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14న 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. మారథాన్ ఆర్‌కే బీచ్ నుంచి ప్రారంభమై విశాఖ తీరప్రాంతం వెంబడి కొనసాగుతుంది.