సైబరాబాద్ కార్పొరేషన్‌లో 42 ఫిర్యాదులు
HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా ఆమె ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 42 ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు ఆదేశించారు.