టిడ్కో గృహాల రుణాల రద్దు చేయాలని సీపీఎం ధర్నా
కాకినాడ: సామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో టిడ్కో గృహాల రుణాల రద్దు కోసం ధర్నా నిర్వహించారు. జగ్గమ్మగారి పేటలోని 500 టిడ్కో గృహాల లబ్ధిదారులు రూ. 3.5 లక్షల రుణం పేరుతో నెలకు రూ. 4000 చొప్పున 20 సంవత్సరాలు చెల్లిస్తే రూ. 10 లక్షలు అవుతుందని, ఇది తీవ్ర రుణభారమని సీపీఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు తక్షణమే రుణమాపీ చేయాలన్నారు.