అధునాతన ఫుడ్ రవాణా ట్రక్కులను పరిశీలించిన కలెక్టర్
కడపలో దేశానికే స్ఫూర్తిగా ఏర్పాటైన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్’ ద్వారా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని చేరవేసేందుకు సిద్ధం చేసిన అధునాతన ఫుడ్ ట్రక్కులను కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం రాత్రి పరిశీలించారు. యూలర్ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఈ ట్రక్కుల పనితీరు, మానిటరింగ్ విధానంపై కలెక్టర్‌కు డెమో ఇచ్చి, వాటి ప్రత్యేకతలను వివరించారు.