ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి
ATP: ఉరవకొండలో ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రెండో రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేశారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించిన మంత్రి, మరికొన్నింటిని దశలవారీగా పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.