'కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలి'

PPM: అసంఘటిత కార్మికులకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని రెండవ అదనపు మన్యం జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ పధకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ.. అసంఘటిత రంగం అనధికారిక రంగంలో ఎక్కువగా గ్రామీణ కార్మికులు మరియు పట్టణ కార్మికులు ఉన్నారన్నారు.