రహస్య తవ్వకాలు.. ఏడుగురు అరెస్టు

రహస్య తవ్వకాలు.. ఏడుగురు అరెస్టు

CTR: BNకండ్రిగ మండలం ఆలత్తూరు గ్రామ శివారులోని ఉమామహేశ్వర్ రెడ్డి పొలంలో నిధులు ఉన్నాయన్న అనుమానంతో రాత్రి సమయంలో రహస్యంగా తవ్వకాలు చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పురాతన తులసికోట వద్ద తవ్వకాలు సాగుతున్నట్టు కాపలాదారు గుర్తించి యజమానికి సమాచారం ఇచ్చాడు. యజమాని పోలీసులకు చెప్పగా, నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తిమ్మయ్య, ఎస్సై విశ్వనాథ నాయుడు తెలిపారు.