కొప్పర్రులో పుస్తక దినోత్సవ వేడుకలు

కొప్పర్రులో పుస్తక దినోత్సవ వేడుకలు

W.G: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కొప్పర్రు MPPS మెయిన్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు. ప్రముఖ రచయితలు రాసిన చందమామ కథలను విద్యార్థులతో చదివించి, కథాంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.