ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
AKP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్ లో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హైస్కూల్ ఇన్ చార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను చదివి విద్యార్థులతో చెప్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.