రేపు సిరిసిల్లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRCL: సిరిసిల్ల పట్టణంలో రేపు ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం కలుగుతుందన్నారు. పెద్దూర్, సర్దాపూర్,జగ్గారావు పల్లి, శాంతినగర్, గీతా నగర్, విద్యానగర్, రాళ్ల బావి, సిద్ధార్థ నగర్, మార్కండేయ స్ట్రీట్, పత్తిపాక వీధిలలో కరెంటు ఉండదన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.