25 మంది మావోయిస్టులు సరెండర్
ఛత్తీస్‌గఢ్ దంతేవడా జిల్లాలో 25 మంది కీలక సభ్యులు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ ఆయుధాలను అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో PLGA కీలక సభ్యుడు మోతిరాయ్, KAMS అధ్యక్షురాలు సుక్మతి, మిలిషియా కమాండర్ మడ్వితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. వీరిపై భారీ రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.