గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కృష్ణా: ఉప్పులూరు పరిధిలోని రైవస్ కాలవలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో కంకిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని వివరాల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీసినా ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.