VIDEO: అప్పంపల్లిలో కల్వర్టులపై ఆందోళన

VIDEO: అప్పంపల్లిలో కల్వర్టులపై ఆందోళన

NRPT: మరికల్ మండలం అప్పంపల్లి శివారులో రెండు చోట్ల రోడ్డుకు సమానంగా ఉన్న కల్వర్టుల వద్ద ప్రమాదాలు పెరుగుతున్నాయి. సూచిక బోర్డులు, కల్వర్టులు ధ్వంసం కావడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఇక్కడే ఇద్దరు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వెంటనే అధికారులు స్పందించి కల్వర్టులను పునర్నిర్మించాలని ప్రయాణికులు, గ్రామస్థులు కోరుతున్నారు.