ఫార్మర్ రిజిస్ట్రీ పై రైతులకు అవగాహన

ADB: రైతులు ఫార్మర్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకోవాలని కప్పర్ల వ్యవసాయ విస్తరణ శివ ప్రసాద్ అన్నారు. బుధవారం తాంసి మండలంలోని పాలోడి గ్రామంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ పై అవగాహన కల్పించారు. రైతులు ఆధార్ నెంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలని ఆధార్ నెంబర్‌కు అనుసంధానం ఉన్న ఫోన్ నెంబర్ వెంట తీసుకురావాలని సూచించారు.