'వంతెన అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి'
SKLM: వజ్రపుకొత్తూరు మండలం నువ్వుల రేవు గ్రామ వంతెన అప్రోచ్ రోడ్డు నిర్వాసితులు, గ్రామ సిబ్బంది, అధికారులతో ఎమ్మెల్యే శిరీష బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు ఏడేళ్లుగా పెండింగులో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.