5,300 విమానాల డెలివరీలో జాప్యం

5,300 విమానాల డెలివరీలో జాప్యం

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమానయాన కంపెనీలు కొత్త విమానాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. అయితే, వీటి డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు 5,300 విమానాల డెలివరీలో జాప్యం నెలకొందని.. దీంతో ఆ సంస్థలకు ఖర్చులు కూడా పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ ఇబ్బందులు మరో 8 ఏళ్ల పాటు కొనసాగొచ్చని పేర్కొంది.