సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమం
KNR: చొప్పదండి మండల కేంద్రంలోని ఆడాస్ట్రా పాఠశాలలో మంగళవారం సీపీఆర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు, పాఠశాల ఛైర్మన్ ముద్దం నరేంద్ర గౌడ్ ఉపాధ్యాయులకు ప్రాణాలను రక్షించే అత్యవసర ప్రతిస్పందన నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, ప్రాథమిక చికిత్స ఎలా అందించాలో ఈ శిక్షణ ద్వారా తెలియజేశారు.