ఆకట్టుకుంటున్న జంఝావతి రబ్బర్ డ్యాం
PPM: ఇంజినీరింగ్ రంగంలో 2006లో సరికొత్త రికార్డు సృష్టించిన 'జంఝావతి రబ్బర్ డ్యాం' మన జిల్లాలోనే ఉంది. ఈ డ్యాం ఆసీయా ఖండంలోనే మొదటిది కావడం విశేషం. ఆస్ట్రియా సాంకేతికతతో 160 మీటర్ల పొడవుగా గాలితో నింపే రబ్బర్ బ్యాగులతో దీన్ని నిర్మించారు. మిగతా డ్యాంల కంటే తక్కువ ఖర్చుతో వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దోహదపడుతుంది. ఈ నిర్మాణం పర్యాటకులు, విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది.