వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య (55) వడదెబ్బకు గురై మృతి చెందాడు. మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.