నేలకొండపల్లి మాజీ మార్కెట్ ఛైర్మన్ మృతి
KMM: కూసుమంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నేలకొండపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరవెల్లి నాగేశ్వరరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.