భారీ వర్షానికి ఇరుక్కుపోయిన ఆటో

భారీ వర్షానికి ఇరుక్కుపోయిన ఆటో

VKB: వికారాబాద్ మండలం బూరుగుపల్లి సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీ వర్షం కారణంగా వరదనీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం ఒక ఆటో నీటిలో చిక్కుకుపోగా, స్థానికులు డ్రైవర్ను, ఆటోను బయటకు తీశారు. వరద ఉధృతి అధికంగా ఉన్నందున వాగు దాటవద్దని అధికారులు సూచించారు.