మిర్యాలగూడలో బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు
నల్గొండ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మిర్యాలగూడపై పడింది. ఇంధన కొరత భయంతో వాహనదారులు బంకులకు పోటెత్తడంతో పలుచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. నిల్వలు లేక కొన్ని బంకులు మూతపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం లోపు లోడ్లు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నా, అనిశ్చితి నెలకొంది. మరోవైపు ఇంధన కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.