టీడబ్ల్యూజేఎఫ్ మూడో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
KMM: ఈ నెల 20న నిర్వహించనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మూడో మహాసభల పోస్టర్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణకు ఈ మహాసభలు దోహదపడాలని అన్నారు. మహాసభలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.