400 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి సుమారు 400 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. నాలుగైదు రోజుల క్రితం జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్, సింగరాయపేట, బొమ్మెన, తదితర గ్రామాలలో అకాల వర్షం నమోదయింది. దీంతో రైతులు పొలాల్లో వేసిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిలిందని అధికారులు వెల్లడించారు.