రేగొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

BHPL: రేగొండ పోలీస్ స్టేషన్‌ను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో వివిధ రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులకు త్వరగా స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు.