మద్యం తాగిన నిందితుడికి నెల రోజుల జైలు శిక్ష
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట పట్టణంలో మద్యం తాగి పట్టుబడిన శివరాత్రి దేవయ్య 50 అనే వ్యక్తికి న్యాయమూర్తి ఫాతిమా చిన్నప్ప బుధవారం నెల రోజుల జైలశిక్షణ విధిస్తూ తీర్పునిచ్చారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో దేవయ్య మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో శిక్ష ఖరారు చేశారు.