గట్టమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రులు

MLG: జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క) ఆదివారం గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరిష్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్ మంత్రులకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి బయలుదేరారు.