నేడు జిల్లాలో PGRS కార్యక్రమం

నేడు జిల్లాలో PGRS కార్యక్రమం

ఏలూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మండల, పురపాలక, డివిజనల్ కార్యాలయాల్లోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. 'మీ కోసం' వినతుల పరిష్కార స్థితి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబరు 1,100ను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.